ATP: రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలనే జగనన్న సంకల్పానికి చంద్రబాబు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.