NLG: నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గిగ్ వర్కర్లకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఇన్సూరెన్స్ కల్పించేందుకు మునిసిపల్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్లో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ SD ముసాబ్ అహ్మద్ తెలిపారు. 18 నుంచి 70 ఏళ్ల వయసు గల వారు ఏడాదికి రూ.20 కట్టి ఈ బీమా పథకంలో చేరాలన్నారు. దరఖాస్తు ఫారాలను కౌంటర్లో సమర్పించాలని తెలిపారు.