KMR: జిల్లాలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 69 మందికి మంగళవారం కోర్టులు మొత్తం రూ.85,100 జరిమానా విధించాయి. వీరిలో కామారెడ్డిలో ఐదుగురికి, దేవునిపల్లిలో నలుగురికి చొప్పున ఒక్కొక్కరికీ ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చాయి. SP రాజేశ్ చంద్ర మాట్లాడుతూ.. జూదం,మద్యం సేవించి వాహనం నడపడరాదన్నారు.