GDWL: ఉండవెల్లి ఆటో డ్రైవర్ కూతురు జి. లావణ్య నీట్ 2025లో మెడిసిన్ సీటు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. రెండవ విడత కౌన్సిలింగ్లో ఆమె వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించింది. తల్లిదండ్రుల కష్టాన్ని, నమ్మకాన్ని నిలబెట్టి, భవిష్యత్తులో గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని లావణ్య బుదావరం పేర్కొన్నారు.