కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘లోక: చాప్టర్ 1′(కొత్త లోక) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా OTTపై అప్డేట్ వచ్చింది. జియో హాట్స్టార్లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించగా.. డొమినిక్ అరుణ్ తెరకెక్కించారు.