KMR: యువతక మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి సూచించారు. నేడు బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో నిర్వహించిన కలాం జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలాం అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ సమాజంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.