న్యూయార్క్ జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(UNHRC)కి భారత్ ఏడోసారి ఎన్నికైంది. 2026 నుంచి 2028 వరకు UNHRC సభ్యదేశంగా భారత్ కొనసాగనుంది. భారత్కు చెందిన మూడేళ్ల కాలపరిమితి 2026 జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. భారత్కు మద్దతిచ్చిన వారికి UN భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ కృతజ్ఞతలు తెలిపారు. UNHRCలో మొత్తం 47 సభ్యదేశాలు ఉన్నాయి.