రష్యా నుంచి భారత్కు చమురు సరఫరాలో గత నెలతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 10 శాతం తగ్గుదల నమోదైంది. ఈ నెలలో భారత్ రోజుకు 45 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఈ తగ్గుదల ఉన్నప్పటికీ, భారత్కు ప్రధాన చమురు ఎగుమతిదారుగా రష్యానే కొనసాగుతోంది. సెప్టెంబర్లో భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం ముడి చమురులో 34 శాతం ఒక్క రష్యా నుంచే జరిగింది.