NLG: నిమ్మ ధరలు భారీగా పడిపోవడంతో ఉమ్మడి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఒక బస్తా రూ.100 నుంచి రూ.200కు మించి పలకడం లేదు. దీంతో కోత కూలీ, రవాణా ఖర్చులూ గిట్టడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసం వేల రూపాయలు ఖర్చు చేసినా.. రైతులకు నష్టాలు తప్పేలా లేవు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.