NLR: గ్రామీణ ప్రాంతాలలో పొదుపు సంఘాలను బలోపేతం చేసే డ్వాక్రా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ సేవలను ప్రభుత్వం గుర్తించి 3 సంవత్సరాల పదవీ కాలం నిబంధనను తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల డ్వాక్రా సంఘ VOA లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విడవలూరు పర్యటనలో వున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కలిసి అభినందనలు తెలియ చేసారు.