అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, US జీవన విధానంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘అమెరికా కథపై ఎప్పుడూ వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. మనమంతా సమానంగా పుట్టామని, ఒకరినొకరు గౌరవంగా, మర్యాదగా చూసుకుంటే అందరం బాగుంటామని చెప్పే కథను నేను బలంగా నమ్ముతాను’ అని ఆయన పేర్కొన్నారు. అందరి మధ్య సమానత్వం, గౌరవం ఉండాలనేదే అమెరికన్ స్ఫూర్తి అని ఒబామా అభిప్రాయపడ్డారు.