NZB: CPGET మొదటి విడత PG కౌన్సిలింగ్లో భాగంగా టీయూలో 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు గత సంవత్సరం కంటే ఈ ఏడాది తక్కువయ్యాయి. డిచ్పల్లితో పాటు బిక్కనూరులోని ప్రాంగణాల్లో మొత్తంగా 252 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. యూనివర్సిటీలో CPGET ద్వారా 26 కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు.