KDP: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చేసిన దాడిని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శుక్రవారం ప్రతి మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని ఎమ్మార్పీఎస్ కడప జిల్లా అధ్యక్షులు ఎం.వెంకటేష్ మాదిగ పిలుపునిచ్చారు. కనీసం 200 మంది నుంచి 500 మందితో ర్యాలీ నిర్వహించి మండల కేంద్రంలోని తాహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించాలన్నారు.