AKP: ఎలమంచిలి సబ్ డివిజన్ పరిధిలో వరి పంటపై ఆకునల్లి, ఆకు చుట్టు పురుగు ఆశించినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు భవాని, శ్రీహరిరావు తెలిపారు. వీరు వ్యవసాయ అధికారులు సుమంత, మోహన్ రావుతో కలిసి ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో పర్యటించి వరి పంటను పరిశీలించారు. అక్కడక్కడ పొటాషియం లోపం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.