E.G: నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం జడ్పీ హైస్కూల్లో బుధవారం ప్రపంచ విద్యార్థుల దినోత్సవం నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో 80 మంది నర్సరీ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు మీసాల శివరామ హరి ప్రసాద్, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.