యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) 6G కనెక్టివిటీ పరీక్షల్లో రికార్డు స్థాయిలో 145 Gbps ఇంటర్నెట్ వేగాన్ని సాధించినట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్స్ రంగంలో కీలకంగా నిలవనుంది. కనెక్టివిటీలో అసాధారణ వేగం తదితర అంశాలు భవిష్యత్ డిజిటల్ ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా 6G టెక్నాలజీ అభివృద్ధిలో ముందుకు సాగుతోంది.