ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటుల పని గంటలపై చర్చ సాగుతోంది. నటి దీపికా పదుకొనే తాను రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. తాజాగా ఈ పనిగంటల చర్చపై మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. నటీనటులు ఎవరైనా సరే, నిర్మాత విజయం సాధించాలనే అంకితభావంతో, నిబద్ధతతో పని చేయాలని ఆమె స్పష్టం చేశారు.