BPT: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయం వద్ద కలాం విగ్రహానికి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలాం జీవితం యువతకు గొప్ప ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు. కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవడం చిరస్మరణీయమన్నారు.