GNTR: కొత్తగా నిర్మించిన CRDA కార్యాలయంలో ఈ ఆటోలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్యాలయానికి వచ్చే సిబ్బందితో పాటు ప్రజలకు సీడ్ యాక్సిస్ రహదారి నుంచి కార్యాలయంలోనికి చేరుకోవడానికి ఈ వాహనాలు వినియోగించనున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వయోవృద్ధులకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.