VSP: కురుపాం గిరిజన పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం పరామర్శించారు. 65 మందిలో 59 మంది డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన ఆరుగురికి మెరుగైన వైద్యం అందుతుందని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో ఆహార నాణ్యత, విద్యార్థుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు.