ప్రకాశం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని కలెక్టర్ రాజబాబు అన్నారు. ఈ మేరకు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం డ్వామా అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా భూగర్భజలస్థాయి పెరిగేలా చెక్ డ్యామ్స్, ఇంకుడు గుంతల నిర్మాణాలు, చెరువులు, ఫీడర్ చానల్స్ పూడికతీత పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.