కృష్ణా: జీఎస్టీ తగ్గింపుతో నిర్మాణ రంగానికి మేలు జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంగళవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో జీఎస్టీ సదస్సు నిర్వహించారు. అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. సిమెంటుపై పది శాతం, మార్బుల్స్, గ్రానైట్, ఇసుక, ఇటుకలపై ఏడు శాతం జీఎస్టీ తగ్గిందని వివరించారు.