ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేస్తాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ బ్యాట్ నుంచి కనీసం 2 సెంచరీలు ఆశించవచ్చని చెప్పాడు. ఆసీస్ గడ్డపై కోహ్లీకి అద్భుత రికార్డులు ఉన్నాయని గుర్తు చేశాడు. వైట్ బాల్ క్రికెట్లో కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్ అని కొనియాడాడు.