SRPT: సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఇవాళ ప్రారంభించారు. క్వింటాకు రూ.2,389 చొప్పున ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.