AP: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. నవంబరు 16వ తేదీన అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ అధికారులు ప్రకటించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబర్ 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరగనున్నాయి.