TG: రాష్ట్రంలో రైతుల విజ్ఞప్తి మేరకు వెంటనే మొక్కజొన్న కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున మొక్కజొన్నను కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ ఎండీని మంత్రి ఆదేశించారు. రైతులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తికి స్పందించి, వెంటనే కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.