హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. సైబర్ సెల్లో పనిచేస్తున్న ASI సందీప్ తన తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్‌పై సందీప్ అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సందీప్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.