HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మాగంటి సునీత కలిశారు. మాగంటి సునీతకు బీ-ఫామ్‌ను కేసీఆర్ అందజేశారు. అనంతరం ఎన్నికల ఖర్చు నిమిత్తం బీఆర్ఎస్ పార్టీ తరపున రూ. 40 లక్షల చెక్కును అందజేశారు.