కరీంనగర్ అర్బన్ మండలంలోని మల్కాపూర్ 2వ అంగన్వాడీ కేంద్రాన్నిఅడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లల గ్రోత్ క్రాస్ చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా రోజు వారీ మెనూ, పిల్లల హాజరు నమోదు, గర్భిణీ బాలింతల సంఖ్య వంటి వివరాలను అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు. పిల్లల హాజరు శాతాన్నిపెంచాలన్నారు.