BHNG: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవతో రాజపేట నుంచి ఆలేరుకు నూతన బస్సు సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. ఈ బస్సు ఉదయం 7 గంటలకు రాజపేట నుంచి బయలుదేరి పారుపల్లి, కొలనుపాక మీదుగా ఆలేరుకు చేరుతుంది. ఆలేరు నుంచి ఉదయం 10 గంటలకు తిరుగు ప్రయాణం అవుతుంది. విద్యార్థులు, ప్రజలు ఈ సేవను వినియోగించుకోవాలన్నారు.