ELR: అనుమతులు లేకుండా దీపావళి బాణాసంచా నిల్వ ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెదపాడు ఎస్సై శారద సతీశ్ హెచ్చరించారు. పెదపాడు పోలీస్ స్టేషన్లో ఇవాళ ఎస్సై మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళికి దుకాణాలు నిర్వహించే వారు రెవెన్యూ, పోలీస్, ఫైర్ అధికారుల అనుమతులు ముందుగా తీసుకోవాలని సూచించారు.