AKP: వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి దృష్టికి నక్కపల్లి మండలం రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ సమస్యను తీసుకువెళ్లినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ తెలిపారు. మంగళవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో రామకృష్ణారెడ్డిని కలిసి మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ రద్దు కోసం 30 రోజులుగా ధర్నా చేస్తున్నట్లు వివరించారు.