VZM: రామభద్రాపురం, బాడంగి మండలాల్లో ఉన్న పాఠశాలలను కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ఆరికతోట జిల్లా పరిషత్ పాఠశాల, కస్తూరిబా బాలిక విద్యాలయాంను తనిఖీలు చేపట్టారు. తరగతి గదులను, విద్యార్థులు ఏ విధంగా అభ్యసిస్తూన్నారో అడిగి తెలుసుకున్నారు.