SKLM: సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్. అమ్మన్నాయుడు, పీ. తేజేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసేవరకు పోరాడుతామని అన్నారు. కారుణ్య నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలని డిమాండ్ చేశారు.