SDPT: జగదేవపూర్ మండలం బీజీ వెంకటాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్థానిక గ్రామ యువకులు చెక్కల మహేష్, చెక్కల గణేష్ ముదిరాజ్ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు దుస్తులు పలకలు పెన్సిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అన్ని విధాలా ఆదుకుంటామని వారు పేర్కొన్నారు.