పాకిస్తాన్ మరోసారి పహల్గామ్ తరహా దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత సైన్యం హెచ్చరించింది. ‘ఆపరేషన్ సింధూర్ 2.0’ మరింత ప్రాణాంతకంగా ఉంటుందని వెస్ట్రన్ కమాండ్ GOC-in-C లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ హెచ్చరించారు. గతంలో వైమానిక స్థావరాలను తక్కువ సంఖ్యలో ధ్వంసం చేశామని, కానీ పాక్ ధోరణి మారకపోతే, ఈసారి భారత ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు.