MDK: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు.