HYD: హైదరాబాద్ పాతబస్తీలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఫర్హాన్ అనే యువకుడు మూసీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహానికై గాలింపు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.