మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావును మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే రక్తదాన శిబిరంపై చర్చించారు. పోలీస్ హెడ్ క్వార్టర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.