HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత రేపు (అక్టోబరు 15) తమ నామినేషన్ పత్రాన్ని సాదాసీదాగా దాఖలు చేయనున్నారు. ఆమె కేవలం నలుగురితో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లనున్నారు. అయితే, ఈనెల 19వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.