KDP: పులివెందులలోని వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ఆయన వైసీపీ నాయకులతో వివిధ అంశాలు, ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉండాలన్నారు.