‘బాహుబలి 1,2’లు కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న రీ-రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఉన్న ముఖ్య ఫార్మాట్లు అన్నింటిలో అప్డేట్ చేసి రీ-రిలీజ్ చేయనున్నారు. ఐమ్యాక్స్, డాల్బీ సినిమా, 4DX, D బాక్స్.. ఇలా అన్ని ఫార్మాట్లలో విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పోస్టర్ వెలువడింది.