కోనసీమ: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబా అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది గుబ్బల రజిత పాల్గొని మాట్లాడుతూ.. ప్రైవేటు రంగంలో మహిళలపై వివక్షత కొనసాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు శైలజ, రాము పాల్గొన్నారు.