ADB: ప్రజలు మంత్ర తంత్రాలు, బాబాలను నమ్మి మోసపోవద్దని ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈనెల తొమ్మిదిన మంత్రాల నేపంతో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు షేక్ కలీంను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఎవరైనా మోసానికి గురైన యెడల జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు.