HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రెండో రోజు నామినేషన్ల దాఖలు ముగిసింది. ఈ రోజు 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగింది. నామినేషన్ దాఖల గడువు ముగిసేలోపు మరి ఎన్ని నామినేషన్లు దాఖలు అవుతాయో అని ఇటు ఓటర్లలో, అటు రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది.