ఒంగోలు పర్యటన నిమిత్తం బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మంగళవారం వచ్చారు. ఒంగోలు సమీపంలోని ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. లిక్కర్‌పై ప్రశ్నించే హక్కు వైసీపీకి లేదన్నారు. అనంతరం బూమ్ బూమ్ అంటూ వైసీపీ హయాంలో నాణ్యత లేని బీర్లను మార్కెట్లోకి తెచ్చి ప్రజలను మోసం చేశారని సోమ వీర్రాజు మండిపడ్డారు.