విశాఖపట్నం ఎక్సైజ్ సిబ్బందికి పెందుర్తి రైల్వే స్టేషన్ వెలుపల 6.8 కిలోల ఎండు గంజాయితో ప్రకాశం జిల్లాకు చెందిన వినీల్ కుమార్, షేక్ సలీంలను మంగళవారం పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి రూ. 40,000 విలువ గల మాదకద్రవ్యం స్వాధీనం చేసుకుని, వారిని పెందుర్తి ఎక్సైజ్ స్టేషన్కి అప్పగించారు.