అన్నమయ్య: ఉడా ఛైర్మన్ బి.ఆర్ సురేష్ బాబును పలువురు నేతలు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలవతో సత్కరించారు. మదనపల్లెను అన్ని విధాల అభివృద్ధి చేయాలని కోరారు. కాగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు పఠాన్ ఖాదర్ ఖాన్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ చారి, నాగూర్ వలి తదితరులు పాల్గొన్నారు.