MBNR: పాడీరైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు తప్పక వేయించాలని జిల్లా పశు వైద్యాధికారి మధుసూదన్ గౌడ్ సూచించారు. బుధవారం దేవరకద్ర మండలం బస్వాయిపల్లిలో నిర్వహించిన 7వ విడత ఉచిత గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమానికి ఆయన హాజరై ప్రారంభించారు. ఈ వ్యాధి వైరస్ వలన వ్యాప్తి చెందుతుందన్నారు. వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలన్నారు.