PDPL: మంథని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న ఏర మనోజ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన అండర్ 17 బాలుర వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈనెల 16 నుంచి 18 వరకు సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువులో నిర్వహించనున్న తెలంగాణ 69వ రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు ఎంపికై అయినట్లు పాఠశాల హెచ్ఎం మోసం శ్రీనివాస్ తెలిపారు.